e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Pawan: భారీ రేటుకి అమ్ముడుపోయిన‌ భీమ్లా నాయ‌క్ ఆడియో రైట్స్

Pawan: భారీ రేటుకి అమ్ముడుపోయిన‌ భీమ్లా నాయ‌క్ ఆడియో రైట్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు మూడేళ్ల పాటు ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉండ‌డంతో అభిమానులు ప‌వ‌న్‌ని వెండితెర‌పై చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రీసెంట్‌గా వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌చార చిత్రాలు మూవీపై భారీ అంచ‌నాలు పెంచాయి.

మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్ర లో నటిస్తున్నారు. రానా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రం కి సంబంధించి విడుద‌లైన మేకింగ్ వీడియో మరియు ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం యొక్క ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

- Advertisement -

5.04 కోట్ల రూపాయల తో ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. గ‌తంలో ప‌వ‌న్ నటించిన ఏ చిత్ర ఆడియో రైట్స్ కూడా ఇంత భారీ రేటుకి అమ్ముడు పోలేదు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనిల‌పాల‌ని చిత్ర బృందం భావిస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement