Matka | టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ (Varun Tej) కాంపౌండ్ నుంచి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన చిత్రం మట్కా (Matka). పలాస 1978 ఫేం డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో భారీ అంచనాల మధ్య నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదలైంది.
అయితే వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టినా.. కథనం బెడిసి కొట్టడంతో బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఇప్పటికే సినిమాను చాలా థియేటర్లలో నుంచి తీసేయగా.. తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో ఆక్యుపెన్సీ 20 శాతంలోపే నమోదైనట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. వరుణ్ తేజ్‌కు మరో ఫ్లాప్ రావడంతో.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చే సినిమాతో రావాలని అంటున్నారు మూవీ లవర్స్.
ఈ మూవీలో అజయ్ ఘోష్, బొమ్మాళి రవిశంకర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Kannappa | మహదేవ్ శాస్త్రిగా మోహన్ బాబు.. కన్నప్ప ప్రీ లుక్ వైరల్
Pushpa 2 The Rule trailer | ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది