War 2 | హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వార్-2’. అయాన్ ముఖర్జీ దర్శకుడు. గూఢచారి థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్లో ఎన్టీఆర్ నటిస్తున్న తొలి స్ట్రెయిట్ చిత్రమిదే కావడంతో ఈ సినిమా గురించి ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల ఆలస్యం కానున్నట్లు తెలిసింది. ఇటీవల పాట చిత్రీకరణ సందర్భంలో హృతిక్ రోషన్ గాయపడ్డట్లు తెలిసింది. దాంతో నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు డాక్టర్లు సూచించారట. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా ముంబయిలో హృతిక్‌రోషన్, ఎన్టీఆర్‌లపై ఓ భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందులో 500 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు కావడంతో ఈ పాట సినిమాకే హైలైట్‌గా ఉంటుందని చిత్రబృందం చెబుతున్నది. ఈ పాట షూటింగ్ సమయంలో హృతిక్ గాయపడ్డారని తెలిసింది. యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.