బాలీవుడ్ చిత్రసీమలో ‘క్రిష్’ ఫ్రాంఛైజీ చిత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. హృతిక్ రోషన్ హీరోగా ఈ సిరీస్‌లో వచ్చిన ‘కోయి మిల్గయా’ ‘క్రిష్’ ‘క్రిష్-3’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించాయి. సూపర్‌హీరో కథాంశంతో ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందించాయి. దాదాపు పదేండ్ల తర్వాత ఈ సిరీస్‌లో నాలుగో భాగం తెరకెక్కనుంది. ‘క్రిష్-4’ చిత్రానికి ‘అగ్నిపథ్’ ఫేమ్ కరణ్మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు.
సిద్ధార్థ్ ఆనంద్ నిర్మించనున్నారు. త్వరలో హృతిక్‌రోషన్ ‘వార్-2’ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ‘క్రిష్-4’ చిత్రం పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నారు.