బాలీవుడ్లో సూపర్ హీరో ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు హృతిక్ రోషన్ మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాడు. ‘క్రిష్’, ‘ధూమ్ 2’ వంటి సినిమాలతో ఇండియన్ సినిమాకు గ్లోబల్ రీచ్ తీసుకొచ్చిన హృతిక్ రోషన్ తాజాగా వాకింగ్ స్టిక్‌తో నడుస్తూ కెమెరాలకి చిక్కాడు. ఈ మధ్యే బర్త్ డే పార్టీలో ఫిట్‌గా కనిపించిన హృతిక్ రోషన్ ఇలా చేతి కర్రలతో నడుస్తూ కనిపించడం ఫ్యాన్స్‌లో టెన్షన్ పుట్టిస్తుంది. సాధారణంగా నవ్వుతూ ఫొటోగ్రాఫర్స్‌ని పలకరించే హృతిక్ ఈ సారి మాత్రం సైలెంట్‌గా తన కారు వైపు వెళ్లాడు. ఆయన నడిచే విధానం చూస్తుంటే మోకాళ్లకి దెబ్బలు బలంగా తగిలినట్టు అర్ధమవుతుంది.
ఇటీవలే తన 52వ పుట్టిన రోజు వేడుకని జరుపుకున్నాడు హృతిక్. ఆ వేడుకకి తన మాజీ భార్య, ప్రియురాలు హాజరవడం విశేషం. వేడుక జరిగిన కొద్ది రోజులకి హృతిక్ ఇలా కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. చివరిగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌తో కలిసి భారీ యాక్షన్ మూవీ ‘వార్ 2’తో ప్రేక్షకులని పలకరించాడు. అతడి ఫిట్నెస్, లుక్‌పై నెటిజన్లు తెగ ఫిదా అవుతుంటారు. ఫిట్నెస్ విషయంలో హృతిక్ ఎంత క్రమశిక్షణతో ఉంటాడో తెలిసిందే. గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్, స్ట్రిక్ట్ డైట్, డిసిప్లిన్డ్ లైఫ్‌స్టైల్ వల్లే ఈ వయసులోనూ సిక్స్ ప్యాక్ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇదిలా ఉండగా, నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా కొత్త ప్రయాణానికి హృతిక్ సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ‘క్రిష్ 4’ను ఆయనే దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
ఇండియన్ సినిమా ‘గ్రీక్ గాడ్’ హృతిక్ రోషన్ జనవరి 10న తన 52వ పుట్టినరోజు జరుపుకున్నాడు. వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా, ఫిట్‌గా మారుతున్న హృతిక్‌ని చూస్తే.. అతనికి 52 ఏళ్లు అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు . వార్ 2 చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించగా, ఈ మూవీ కోసం హృతిక్ మేకోవర్ చూసి చాలా మంది షాక్ తిన్నారు. మరి ఐదు పదుల వయసు దాటినా అతడు ఇంత స్ట్రాంగ్‌గా, సిక్స్ ప్యాక్‌తో మెరవడానికి కారణమేంటి? అతని డైట్, వర్కౌట్ రొటీన్ ఏంటి అని చాలా మంది ఆరాలు తీస్తుంటారు.