War 2 | బాలీవుడ్లో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది. స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ YRF Spy Universe బ్యానర్లో తెరకెక్కిస్తున్న చిత్రం వార్ 2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన వార్‌కు సీక్వెల్‌గా వస్తోంది. కొన్ని రోజుల క్రితం వార్ 2 షూటింగ్ స్పెయిన్‌లో నిర్వహించినట్టు విజువల్స్ బయటకు రాగా.. నెట్టింట హల్చల్ చేస్తుంది.
ఈ షెడ్యూల్లో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తొలిసారి వార్ 2 గురించి మాట్లాడాడు హృతిక్ రోషన్. వార్ 2 సాలిడ్ యాక్షన్ పార్టుతో పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌తో ఉండబోతుందని అన్నాడు. భారీ స్థాయిలో రాబోతున్న వినోదాత్మక చిత్రమని, జూనియర్ ఎన్టీఆర్‌తో పనిచేస్తుండటం చాలా ఎక్జయిటింగ్ ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇద్దరినీ సిల్వర్ స్క్రీన్‌పై ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు అభిమానులు కూడా చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
తాజా టాక్ ప్రకారం వార్ 2లో తారక్ నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రలో కనిపించబోతున్నాడట. ధూమ్ సిరీస్‌లో విలన్ పాత్రలలాగే సూపర్ స్టైలిష్‌గా తారక్ రోల్ ఉండబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ప్రొడక్షన్ దశలో ఉండగా.. వార్ 2 షూటింగ్ ఫిబ్రవరి మూడో వారంలో మొదలు కానుంది. వార్ 2 ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే దానిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
వార్ 2 YRF Spy Universeలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో ప్రాజెక్టు కావడం విశేషం. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. టైగర్ 3 ఎండింగ్లో వార్ 2 గ్లింప్స్ కూడా ప్లే చేయగా.. ప్రేక్షకులు థ్రిల్‌కు గురి చేస్తుంది.
#WAR2 – AUG 2025 RELEASE@tarak9999 @iHrithik pic.twitter.com/i4eOlI1cZj
— NTR Arts (@NTR_Artss) November 29, 2023
#HritikRoshan in & as Kabir – Thursday, 14th August 2025 !!
| #JrNTR | #War2 | #SiddharthAnand | #YRF | #YRFSpyUniverse pic.twitter.com/KHnZEJRg8t
— BFilmy Official (@BFilmyOfficial) November 29, 2023
వార్ 2 షూటింగ్ విజువల్స్..
#War2 BTS :
Car Chase Action Sequence Shoot is going on…
Hrithik will Join them very soon…😉#War2 #HrithikRoshan #JrNTR ❤️#ManOfMassesNTR #Devara #Fighter pic.twitter.com/cfj8OIq5n5— Scroll & Play (@scrollandplay) October 18, 2023
#War2 Car chase sequence in Spain. #HrithikRoshan #JrNtr #War2 pic.twitter.com/OwKCpxVIOe
— Mir Aleem (@Aleem1169966) October 18, 2023