Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ తన మాజీ అత్త జరీన్ ఖాన్ సంస్మరణ సభలో (Prayer Meet) భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవలే వయస్సు సంబంధిత అనారోగ్యంతో కన్నుమూసిన జరీన్ ఖాన్ ( హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్ తల్లి) సంస్మరణ సభ సోమవారం ముంబైలో జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి హృతిక్ రోషన్ హాజరై జరీన్ ఖాన్ జ్ఞాపకాలను తలచుకుని ఎమోషనల్ అయ్యారు. ఆయన మాజీ భార్య సుసానే ఖాన్ తన తల్లిని గుర్తు చేసుకుని, అదుపు చేసుకోలేనంతగా కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ బాధాకరమైన సమయంలో హృతిక్ ఆమెకు అండగా ఉంటూ తన మాజీ అత్త పట్ల గౌరవాన్ని ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
హృతిక్ – సుసానే 2000లో ప్రేమ వివాహం చేసుకోగా.. 2014లో ఈ జంట విడిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం హృతిక్ రోషన్ నటి సబా అజాద్‌తో రిలేషన్లో ఉండగా.. సుసానే కొన్ని అర్జున్ రాంపాల్‌తో డేటింగ్లో ఉండి విడిపోయినట్లు సమాచారం.