Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం సినిమాల వేగాన్ని తగ్గించాడు. గతంలో ప్రతి ఏడాది ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలుకరించేవాడు. గత రెండు సంవత్సరాలలో హృతిక్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇదిలా ఉంటే హృతిక్ తాజాగా మరోసారి పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. 2014లో తన భార్య సుస్సన్నే ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు హృతిక్. విడాకుల తర్వాత బాలీవుడ్ నటి సబా ఆజాద్‌తో సన్నిహితంగా ఉంటున్నాడు. తాజాగా హృతిక్ కుటుంబ సభ్యులకు సబా ఆజాద్‌ను పరిచయం చేసాడని, వాళ్ళకి కూడా తను బాగా నచ్చిందని సమాచారం. త్వరలోనే వీళ్ల పెళ్ళి గురించి అధికారికంగా ప్రకటన రానుందంటూ బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.
హృతిక్ వార్ చిత్రం తరువాత ఇప్పటివరకు ఈయన సినిమా రాలేదు. ప్రస్తుతం ఈయన విక్రమ్ వేద సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో సూపర్ హట్టయిన విక్రమ్ వేద చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సైఫ్ అలీఖాన్ మరో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. విక్రమ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ పోలీస్ ఆధికారిగా నటించగా, వేద పాత్రలో హృతిక్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నాడు. దీనితో పాటు షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాలో , సల్మాన్ ఖాన్ టైగర్-3 సినిమాలో గెస్ట్ రోల్లో నటించనున్నాడు.