Fighter Box Office Collections : హృతిక్ రోషన్, దీపికా పదుకోన్‌లు జంటగా తెరకెక్కిన ఏరియల్ యాక్షన్ ఫిల్మ్ ఫైటర్ మూవీ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు రూ. 22.50 కోట్లు రాబట్టిన ఫైటర్ ఆపై రెండో రోజు రిపబ్లిక్ డే హాలిడే కావడంతో ఏకంగా 75 శాతం వసూళ్లు పెరిగాయి.
రెండో రోజు రూ. 40 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన ఫైటర్ మూడో రోజు శనివారం రూ. 28 కోట్లు రాబట్టి భారీ వీకెండ్ వసూళ్ల దిశగా దూసుకెళుతోంది. చెన్నై, హైదరాబాద్, ముంబై, పుణే, చండీఘఢ్, బెంగళూర్, జైపూర్, ఎన్సీఆర్, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లో ఫైటర్ భారీ కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
శని, ఆదివారాలు మంచి కలెక్షన్లు రాబడితే ఫైటర్ వీకెండ్ కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని సినీ విమర్శకులు, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇక ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే ఫైటర్ మూవీ రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. కీలక ప్రాంతాల్లో ఫైటర్ వసూళ్లలో గట్టి పట్టు కనబరుస్తోందని చెప్పారు.
Read More :