పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘హ్రీం’. రాజేశ్ రావూరి దర్శకుడు. శివ మల్లాల నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సందీప్‌కిషన్ క్లాప్ ఇవ్వగా, నటుడు రాజీవ్ కనకాల కెమెరా స్విచాన్ చేశారు. నటులు అలీ, బెనర్జీ, ఆడిటర్ విజయేంద్రరెడ్డి, సినీజోష్ పర్వతనేని రాంబాబు, డైరెక్టర్ రాజేష్ కలిసి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. సినిమా బాగా రావాలని, ఘన విజయం సాధించాలని అతిథులంతా ఆకాంక్షించారు.
ఈ చిత్ర నిర్మాత, సీనియర్ ఫొటో జర్నలిస్ట్ శివ మల్లాలతో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అతిథులంతా గుర్తుచేసుకున్నారు. ఇంకా దర్శక రచయిత జనార్దన మహర్షి, నిర్మాత కె.బాబురెడ్డి, తమిళ నిర్మాత జి.సతీశ్‌కుమార్, దర్శకులు హరీశ్ నాగరాజ్, ముకేష్ ప్రజాపతి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్, సంగీతం: మార్కస్.ఎం.