Mrunal Thakur | బాలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీన్ ఆర్యన్, కియారా అద్వానీ (Kiara Advani) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సత్యప్రేమ్ కీ కథ (SatyaPrem Ki Katha). మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సమీర్ విద్వాంస్ దర్శకత్వం వహించాడు. జూన్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. కాగా నిన్న రాత్రి ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయగా.. బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) వీక్షించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని ప్రశంసలు కురిపించింది.
అంతేకాదు సినిమా చూసిన తర్వాత మృణాళ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆమె ఎంత అందంగా ఉంది.. అంటూ కియారా అద్వానీని ఆకాశానికెత్తేసింది మృణాళ్ ఠాకూర్. స్క్రీనింగ్‌కు బ్లాక్ డ్రెస్‌లో హాజరై.. రెడ్ కార్పెట్‌పై నడుస్తూ హొయలు పోయింది మృణాళ్ ఠాకూర్. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, నమ: పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి.
సీతారామం సినిమాతో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మృణాళ్ ఠాకూర్. ఈ చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో నాని హీరోగా నటిస్తున్న నాని 30 ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు తెలుగులో విజయ్ దేవరకొండ 13వ చిత్రంలో కూడా నటిస్తోంది. మృణాళ్ ఠాకూర్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన లస్ట్ స్ట్రోరీస్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
#MrunalThakur says kitni sundar hai yaar vo to #KiaraAdvani after watching #SatyaPremKiKatha movie pic.twitter.com/ZS5XrXRIk3
— B-Town Life (@BTownLife1) June 29, 2023
If it’s Mrunal in black, there’s Pooja matching her hotness in blue🖤💙 what a combo🔥❤️ #MrunalThakur x #PoojaHegde pic.twitter.com/kdhtmry2pY
— Asad Mahmood (@Asad889908) June 29, 2023
సత్యప్రేమ్ కీ కథ ట్రైలర్..