బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ఇంటి సభ్యులు తమ జీవితంలో ఏర్పడ్డ అడ్డంకులు గురించి వివరించారు.ముందుగా మట్లాడిన సన్నీ.. తను ఎన్నోఅవమానాలు ఎదుర్కొన్నట్టు తెలియజేశారు. అమ్మ పేరు కళావతి.ముగ్గురు అబ్బాయిలని పెంచడం ఆమెకు ఛాలెంజింగ్‌గా మారింది. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలామంది నన్నెన్నోమాటలు అన్నారు.
వాళ్లే నీ ఆశీర్వాదం అంటూ నా డైరెక్టర్ అన్నారు. అలా నా ప్రయాణం మొదలై ఇక్కడిదాకా వచ్చాను’ అని చెప్పుకొచ్చాడు సన్నీ. ఇక షణ్ముఖ్ మాట్లాడుతూ.. ‘ఇంటర్ సెకండియర్ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది. అదే సమయంలో లవ్ బ్రేకప్ కావడంతో నా సగం జీవితం పోయిందని చాలా ఫీలయ్యా. సూసైడ్ చేసుకుందామని అనుకున్నా. ఆ సమయంలో నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి డోర్ కొట్టాడు.
నేను తీయకపోయే సరికి లోపలకి వచ్చి నాలుగు పీకాడు. వాడివల్లే నేను బతికున్నాఅంటూ షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. జెస్సీ మాట్లాడుతూ.. ‘నాన్న చనిపోయాక చదువుతూ పార్ట్ టైం జాబ్ చేశాను. ఒకసారి లైవ్‌లో ఫ్యాషన్ షో చూశా, ఇదే నాకు సరైనది అనిపించింది. అయితే నా గొంతు సరిగా లేకపోవడంతో చాలామంది హేళన చేశారు. అన్ని దాటుకొని ముందుకు సాగాను. గిన్నిస్ బుక్ రికార్డుకెక్కాను. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మా అమ్మ నేను మోడల్ అంటూ అందరికి చాటింపు వేసింది అని జెస్సీ అన్నాడు.