Housefull 5 Trailer | బాలీవుడ్లో నవ్వుల జాతర సృష్టించిన ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీ నుంచి తాజాగా మరో చిత్రం రాబోతుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నాలుగు చిత్రాలు రాగా.. తాజాగా 5వ చిత్రం రాబోతుంది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. తరుణ్ మన్సుఖానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నడియాడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 06న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్లో జరిగే మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఒక బిలియనీర్ హత్యకు గురవగా.. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ పాత్రలు నిందితులుగా ఉంటాయి. అయితే ఆ హాత్య చేసింది ఎవరనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రం బాలీవుడ్లో ఇటీవలి కాలంలో అతిపెద్ద తారాగణాలలో ఒకటిగా నిలిచింది. ఇందులో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పడే, నానా పటేకర్, డీనో మోరియా, నర్గీస్ ఫక్రి, సోనమ్ బజ్వా, చిత్రాంగద సింగ్, సౌందర్య శర్మ, చుంకీ పాండే, జానీ లివర్, నికితిన్ ధీర్, రంజీత్ తదితరులు నటించబోతున్నారు.