నిరంజన్, గ్రీష్మ, నేత్రికా, ప్రియాంక, దీప్తి శ్రీరంగం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రుక్మిణి’. సింహాచలం గుడుపూరి దర్శకుడు. నేలబల్లి సుబ్రహ్మణ్య రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మాతలు.
గురువారం సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. హారర్ కామెడీ జోనర్లో విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఆద్యంతం సస్పెన్స్ ప్రధానంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: తరుణ్ రావుల, సంగీతం: సుభాష్ ఆనంద్, రచన-దర్శకత్వం: సింహాచలం గుడుపూరి.