న్యూఢిల్లీ : సింప్లిసిటీ, బోల్డ్ కామెంట్స్ చేయడంలో హాలీవుడ్ నటులు ఎన్నడూ వెనకాడరు. రొమాంటిక్ కామెడీల్లో తానెందుకు కనిపించనో హాలీవుడ్ స్టార్ హ్యూ గ్రాంట్ (Hugh Grant) ఇటీవల వెల్లడించారు. అలాంటి సినిమాల్లో సందడి చేసేందుకు తన వయసు సరిపడదని, ఆ మూవీస్లో తాను వికారంగా, బొద్దుగా ఉంటానని నిర్మొహమాటంగా చెప్పేశాడు.
నటి, హోస్ట్ డ్రూ బేరీమోర్ షోలో హ్యూ మాట్లాడుతూ ఐకానిక్ రామ్కామ్స్తో ప్రేక్షకులను అలరించిన తాను ఎందుకు అలాంటి మూవీస్లో ఎంతోకాలం మెప్పించలేనని చెప్పుకొచ్చాడు. తనకు పెండ్లయి, పిల్లలున్నారని, సంతోషంగా ఉన్నానని సహజంగా వయసు మీరడంతో వినూత్నంగా వర్క్ చేసే సావకాశం లభించిందని చెప్పాడు.
హ్యూ గ్రాంట్ నాటింగ్ హిల్, ఫోర్ వెడ్డింగ్స్ అండ్ ఏ ఫ్యునరల్ వంటి రొమాంటిక్ కామెడీ మూవీస్తో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. ఇక హ్యూ గ్రాంట్ లేటెస్ట్ మూవీ డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పలు థియేటర్లలో సందడి చేస్తోంది.
Read More :
OG | అభిమానులు ఆకలితో ఉన్నారు.. పవన్ కల్యాణ్ ఓజీపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్