తమిళ దర్శకుడు విక్రమన్ కుమారుడు విజయ్ కనిష్క హీరోగా నటించిన చిత్రం ‘హిట్ లిస్ట్’. శరత్‌కుమార్, సముద్రఖని, గౌతమ్‌వాసుదేవ మీనన్ కీలక పాత్రలు పోషించారు. సూర్య కతిర్ కాకల్లార్, కె.కార్తికేయన్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నటులు మురళీమోహన్, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
విక్రమన్ కుమారుడైన విజయ్ కనిష్కను హీరోగా పరిచయం చేస్తున్నందుకు కె.ఎస్.రవికుమార్ ఆనందం వెలిబుచ్చారు. తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్న శ్రీనివాస్ గౌడ్, బిక్కం రవీంద్రకు ప్రత్యేక కృతజ్ఞతలని, దర్శకుల ప్రోత్సాహం వల్లే ఈ పాత్ర చేయగలిగానని హీరో విజయ్ కనిష్క అన్నారు. ఇంకా తెలుగు నిర్మాతలైన శ్రీనివాస్ గౌడ్, బెక్కం రవీంద్ర కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కె.రామ్‌చరణ్, సంగీతం: సి.సత్య. నిర్మాణం: ఆర్.కె.సెల్యులాయిడ్స్.