Hit Movie Teaser | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి అంచనాలతోనే వస్తున్న చిత్రం ‘హిట్-2’. 2020లో విశ్వక్సేన్ హీరోగా నటించిన ‘హిట్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై విపరీతమై అంచనాలు క్రియేట్ చేస్తుంది.
ఈ సినిమా టీజర్‌ను గురువారం రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. కాగా తాజాగా టీజర్ టైమ్‌ను ఫిక్స్ చేసింది. ఈ సినిమా టీజర్‌ను గురువారం ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కినట్లు ఇటీవలే దర్శకుడు తెలిపాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ హీరోయిన్గా నటిస్తుంది. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని నిర్మిస్తున్నారు.
#HIT2 TEASER
Tomorrow.
11:07 AM.
It Begins. pic.twitter.com/4TvlrOCMwm
— Adivi Sesh (@AdiviSesh) November 2, 2022