తమిళ దర్శకుడు విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క హీరోగా నటించిన చిత్రం ‘హిట్‌లిస్ట్’. సూర్య కతిర్, కే.కార్తికేయన్ దర్శకత్వం వహించారు. ఆర్.కె.సెల్యూలాయిడ్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అగ్ర హీరో సూర్య విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ చిత్రమిది.
ఆద్యంతం అనూహ్య మలుపులతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. పోరాట ఘట్టాలు రోమాంచితంగా అనిపిస్తాయి’ అన్నారు. శరత్‌కుమార్, సముద్రఖని, గౌతమ్‌వాసుదేవ్ మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.రామ్‌చరణ్, సంగీతం: పి.సత్య, కథ: ఎస్.దేవరాజ్, దర్శకత్వం: సూర్య కతిర్, కే.కార్తికేయన్.