Kingdom Movie | స్టార్ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఖుషి, లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి బ్యాక్టూ బ్యాక్ ఫ్లాప్‌ల తర్వాత ఎలాగైన హిట్టు కొట్టాలనే కసితో విజయ్ దేవరకొండ ఈ సినిమా చేశాడు. అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మార్నింగ్ షోల నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో కొత్త సినిమా వచ్చిందని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా గౌతమ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. విజయ్, సత్యదేవ్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాను చూసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కొడుకు హిమాన్షు రావు కల్వకుంట్ల (Himanshu Rao Kalvakuntla) సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
”RTC X రోడ్స్‌లో నా స్నేహితులతో కలిసి “కింగ్డమ్” సినిమా చూశాను. ఒక థియేటర్లో ఇంత మంచి అనుభూతి పొందడం నాకు ఇదే మొదటిసారి!. స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉండడంతో, ప్రేక్షకులంతా సినిమాను బాగా ఎంజాయ్ చేస్తూ అరుస్తున్నారు. థియేటర్ వాతావరణం మొత్తం గూస్బంప్స్ తెప్పించేలా ఉండడమే కాకుండా. చాలా ఎనర్జీ కనిపించింది. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన అద్భుతంగా ఉంది. సినిమా అయితే నాకు చాలా నచ్చిందంటూ హిమాన్షు కల్వకుంట్ల రాసుకోచ్చాడు. అయితే ఈ పోస్ట్‌పై విజయ్ స్పందిస్తూ.. హిమాన్షు లవ్ యూ అంటూ లవ్ ఎమోజీలను పెట్టాడు. కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Just watched Kingdom with a couple of friends at RTC X Roads. First time in an electrifying theatre 😁
The energy in the theatre was insane with a huge screen, hyped-up audience, and a vibe that gave goosebumps!
Stellar performance by @TheDeverakonda absolutely loved the film!
— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) July 31, 2025
KTR’s son Himanshu watched #Kingdom pic.twitter.com/2f2Exnm2O8
— Suresh PRO (@SureshPRO_) July 31, 2025