Shalini Pandey | చీకటి గదిలో సన్నివేశం తీస్తుంటే.. భయమేసి బయటకు పరిగెత్తుకొచ్చిందట ‘అర్జున్‌రెడ్డి’ భామ షాలినీ పాండే. ఈ అందాలభామ నటించిన ‘మహారాజ్’ సినిమా ఇటీవలే ఓటీటీలో విడుదలై అద్భుతమైన ఆదరణ పొందుతున్నది.
జునైద్‌ఖాన్, జైదీప్ అహ్లవ్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ మల్హోత్రా తెరకెక్కించారు. ఈ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది షాలిని. ‘1800 కాలంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది.
ఇందులో నా కేరక్టర్ పేరు ‘కిషోరి’. అద్భుతమైన పాత్ర. కథానుగుణంగా ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని తీస్తున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా. చీకటి గదిలో తీస్తున్న ఫీల్ రావడానికి నేచురల్ లైటింగ్‌నే వాడారు. నాకేమో చీకటి అంటే భయం. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా భయం వేసింది.
లేచి బయటికి పరుగు తీశాను. నా పరిస్థితిని గమనించిన దర్శకుడు సిద్ధార్థ్ చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని సెట్ చేసి, నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షూట్ చేశారు. ఆ సందర్భాన్ని తలచుకుంటే నిజంగా నవ్వొస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది షాలిని.