ఒకప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా రాణించింది రంభ. తొంభై దశకంలో యువతరంలో మంచి క్రేజ్ సంపాదించుకొని పలు విజయవంతమైన చిత్రాల్లో భాగమైంది. కొన్నేళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న ఆమె తాజాగా రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ ‘సినీరంగంలోకి పునరాగమనానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నా. నా వయసుకు తగినట్లు చాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మంచి పాత్రల ద్వారా తిరిగి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోవాలనుకుంటున్నా’ అని చెప్పింది.