జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’. పూర్వాజ్ కీలక పాత్ర పోషిస్తూ, స్వీయదర్శకత్వంలో ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డిలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఆదివారం ఈ సినిమాలోని జ్యోతి పూర్వాజ్ పాత్రను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఓ చేత్తో గొడ్డలి పట్టుకొని, మరో వైపు కూరగాయల సంచిని భుజాన తగిలించుకొని సీరియస్‌గా చూస్తున్న జ్యోతి పూర్వాజ్ని ఈ ఫస్ట్‌లుక్‌లో చూడొచ్చు. వెనుక అద్దంలో జ్యోతి పూర్వాజ్ ప్రతిబింబానికి బదులుగా గొడ్డలి పట్టుకున్న ఉమెన్ రోబో కనిపిస్తుండటం ఈ పోస్టర్లో విశేషం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం, నిర్మాణం: థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ.