Tangalan | తమిళ అగ్ర హీరో విక్రమ్ నటిస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘తంగలాన్’. పా.రంజిత్ దర్శకుడు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ కథానాయికలు. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు.
బంగారం వేటలో రెండు తెగల మధ్య పోరుతో ఆరంభమైన ట్రైలర్ ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగింది. బ్రిటీష్ అధికారులు బంగారం వెలికితీత కోసం స్థానిక తెగల వారిని పనిలో పెట్టుకుంటారు. అందులో ఓ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపించారు. తన వారి అస్తిత్వం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే నాయకుడిగా విక్రమ్ పాత్ర శక్తివంతంగా సాగింది. విల్లు, బరిసెలు, ఈటెలతో చేసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా నిలిచాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నందిస్తున్నాడు.