Line Man Movie | కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు యువ హీరో త్రిగుణ్. ఆయన ‘లైన్‌మ్యాన్’ చిత్రం ద్వారా కన్నడ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
‘ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు చెందిన లైన్‌మ్యాన్ జీవితంలో చోటుచేసుకున్న ఆసక్తికరమైన సంఘటనలతో ఈ సినిమాను తెరకెక్కించాం. కర్ణాటక మాండ్య ప్రాంతంలోని గ్రామీణ వాతావరణాన్ని ఆవిష్కరిస్తుంది. ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. కాజల్ కుందెర్, బి.జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శాంతిసాగర్ హెచ్.జి, సంగీతం: కాద్రి మణికాంత్, నిర్మాణ సంస్థ: పర్సల్ రాక్ ఎంటర్టైనర్స్, రచన-దర్శకత్వం: వి.రఘుశాస్త్రి.