సుమంత్ కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. రాజశ్యామల పతాకంపై మధు కాలిపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది. తాజాగా సుమంత్ ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయన కెరీర్లో ఈ సినిమా మైలురాయిలా నిలిచిపోతుందని, అన్ని వర్గాలనూ అలరించేలా సినిమా ఉంటుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని ఆయన తెలిపారు. మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.