కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘సుందరాంగుడు’. ఈ చిత్రాన్ని ఏవీ సుబ్బారావు సమర్పణలో ఎమ్మెస్కే ప్రమిద శ్రీ ఫిలింస్ పతాకంపై బీసు చందర్ గౌడ్, ఎమ్మెస్కే రాజు నిర్మించారు. వినయ్ బాబు దర్శకుడు. ఈ నెల 17న ఈ సినిమా విడుదలవుతున్నది. తాజాగా ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ…‘లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆరు పాటలు ఉంటాయి. హైదరాబాద్‌లో పాటు గోవాలో వీటి చిత్రీకరణ జరిపాం. ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని మా కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్‌కు అందిస్తాం’ అన్నారు.