‘గత కొంతకాలంగా వరుసగా మూడు సినిమాలు చేశా. కానీ ఈ సినిమా చాలా ఎమోషనల్ ఫిలిం. వ్యక్తిగతంగా కూడా ఈ సినిమాతో ఎంతగానో కనెక్ట్ అయ్యాను. నా మనసులోని ఆలోచనలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి’ అన్నారు హీరో రామ్. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. మహేష్‌బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మంగళవారం కర్నూల్లో ట్రైలర్‌లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరో అభిమాని కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ..ఈ సినిమాలో తాను అభిమాని పాత్ర పోషించానని, సూపర్‌స్టార్‌గా ఉపేంద్ర కనిపిస్తారని, ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏంటనేది కథలో ఆసక్తికరంగా ఉంటుందని, ఇది అందరి అభిమానుల కథ అని తెలిపారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఈ సినిమా చేశామని నిర్మాత వై.రవిశంకర్ పేర్కొన్నారు. రామ్ కెరీర్లో అత్యున్నత స్థాయిలో నిలబడే సినిమా ఇదని దర్శకుడు మహేష్‌బాబు పి అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.