‘ ‘వీక్షణం’లో సరదాగా ఉండే కుర్రాడిగా కనిపిస్తా. పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉండే పాత్ర నాది. ఆ మనస్తత్వం వల్ల తను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనే ప్రశ్నకు సమాధానమే ‘వీక్షణం’ అని హీరో రామ్ కార్తీక్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఈ చిత్రానికి మనోజ్ పల్లేటి దర్శకుడు. పి.పద్మనాభరెడ్డి, అశోక్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌కార్తీక్ మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. ‘ప్రేమకథగా మొదలై థ్రిల్లర్‌గా మారే వైరైటీ సబ్జెక్ట్ ఇది. ఇలాంటి సినిమా చేయడం ఇదే ప్రథమం. దర్శకుడు మనోజ్ స్క్రిప్ట్ విషయంలో ఎక్కువ సమయం తీసుకున్నారు. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్. ప్రీ ైక్లెమాక్స్ అందరూ షాక్ అయ్యేలా ఉంటుంది. భయపెడుతూనే దాన్ని ఎలా అధిగమించాలో తెలిపే సినిమా ఇది’ అని చెప్పారు.