టాలీవుడ్‌పై హీరో డా.రాజశేఖర్ వేసిన ముద్ర బలమైనది. ఆయన సినిమాలను అభిమానించే వాళ్లు నేటికీ కోకొల్లలు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఆయన కాస్త వెనుకబడ్డ మాట వాస్తవం. ఏడేళ్ల క్రితం ‘గరుడవేగ’ సినిమాతో రాజశేఖర్ కెరీర్‌కి కొత్త జోష్ వచ్చింది. అయితే.. అది కంటిన్యూ కాలేదు. ఆ తర్వాత వచ్చిన ‘కల్కి’ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడాయన మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించారు. తమిళ సినిమా ‘లబ్బర్ పంతు’ రీమేక్ రైట్స్ కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది.
అలాగే విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్’లో పవర్ఫుల్ విలన్‌గా రాజశేఖర్ కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. రాజశేఖర్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నదని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఆ సినిమాకు ‘మగాడు’ అనే టైటిల్‌ని లాక్ చేశారని తెలుస్తున్నది. 1990లో రాజశేఖర్ నటించిన ‘మగాడు’ సినిమా ఆయనకి చాలా క్రేజ్ తీసుకొచ్చింది. ఆ సినిమాతో ఉత్తమనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు రాజశేఖర్. ఇప్పుడు మళ్లీ అదే టైటిల్‌తో సినిమా చేయడం నిజంగా క్రేజీ ఫ్యాక్టర్. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నది.