తిరుమల: న్యాచురల్ స్టార్ నాని (Hero Nani) కాలినడకన తిరుమలకు వెళ్లారు. సతీమణి అంజన, తనయుడు అర్జున్‌తో అలిపిరి నుంచి మెట్లమార్గంలో తిరుమల చేరుకున్నారు. వారితోపాటు ‘సరిపోదా శనివారం’ సినిమా కథానాయిక అరుళ్ మోహన్ కూడా ఉన్నారు. అనంతరం వారు తిరుమలేశుడిని దర్శించుకున్నారు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు 24న గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీ ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదలవుతోంది.
అలిపిరి నుండి కాలినడకన తిరుమల చేరుకున్న హీరో #Nani, హీరోయిన్ #PriyankaMohan
భార్య, కొడుకుతో కలిసి కాలినడకన తిరుమలకు వచ్చిన నాని.#SaripodhaaSanivaaram #SuryasSaturday #Tirumala #Tollywood #Tupaki pic.twitter.com/1Qz7YLqnaR
— Tupaki (@tupaki_official) August 24, 2024