Manchu Manoj | టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ తన కూతురికి నామకరణం చేశాడు. తన అత్త శోభ నాగిరెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి (Lord Subramanya Swamy) భార్య దేవసేన పేరు కలిసి వచ్చేలా ‘దేవసేన శోభ ఎంఎం’ (Devasena Shobha MM) అని పేరు పెట్టారు. మంచు మనోజ్- మౌనిక దంపతులు ఇటీవల తల్లిదండ్రులయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 13న మంచు మౌనిక పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని తెలుపుతూ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది. మా ఇంట్లోకి చిన్న దేవత వచ్చింది. అప్పుడే తనకి ఎంఎం పులి(MM Puli) అనే నిక్ నేమ్ కూడా పెట్టాము. అంటూ రాసుకోచ్చింది. అయితే నేడు ఈ పాపకు నామకరణం చేశారు.
‘దేవసేన శోభ ఎంఎం (Devasena Shobha MM) మనోజ్ తన అత్తగారి పేరు శోభ నాగిరెడ్డి అలాగే సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరు వచ్చేలా ఈ పేరు పెట్టినట్లు ప్రకటించాడు. మీ ఆశీస్సులు ఈ ఫ్యామిలీపై ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మంచు మనోజ్ తెలిపాడు. ఈ వేడుకలో మంచు మనోజ్ కుటుంబ సభ్యులతో పాటు మౌనిక కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.
A moment to cherish lifetime for Manchu & Bhuma families @HeroManoj1 introduces his baby daughter to the world, ‘Devasena Shobha MM’ who is named after his mother-in-law and Lord Subramaniam Swamy’s wife with utter delight #ManojManchu and his wife #MounikaBhumaManchu took… pic.twitter.com/v6qkeL1owf
— Vamsi Kaka (@vamsikaka) July 8, 2024
ఇవి కూడా చదవండి..