కన్నడ అగ్ర నటుడు సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మ్యాక్స్’. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మించారు. ఈ నెల 27న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా తెలుగులో విడుదలకానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కిచ్చా సుదీప్ నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, సుదీప్ చేసిన యాక్షన్ ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్‌చంద్ర, సంగీతం: అజనీష్ లోకనాథ్, దర్శకత్వం: విజయ్ కార్తికేయ.