తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha). బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ (Varun Dhawan)-సమంత కాంబినేషన్లో వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజ్&డీకే (Raj and DK) డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ Citadel టైటిల్‌తో తెరకెక్కుతోంది. కాగా తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ వెబ్ ప్రాజెక్ట్ నుంచి సమంత పక్కకు తప్పుకుందంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆరోగ్య కారణాల రీత్యా సామ్ ఈ ప్రాజెక్ట్ చేయడం లేదని టాక్ జోరుగా నడుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ తెరపైకి వచ్చింది. జనవరి చివరలో సమంత Citadel సెట్స్ లో జాయిన్ కాబోతుందని తాజా సమాచారం. రాజ్&డీకే-సమంత కాంబినేషన్లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత తెరకెక్కుతున్న రెండో ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
సమంత మరోవైపు శివనిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్ కూడా షురూ చేయనుందట. ఈ మూవీ లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. దీంతోపాటు గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం ఫిబ్రవరి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ మూవీలో మలయాళ నటుడు దేవ్‌మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు.