Varun doctor movie final collections | తమిళ హీరోలకు తెలుగులో మార్కెట్ త్వరగానే వస్తుంది. అలాగే ఇప్పుడు మరో తమిళ హీరో తెలుగులో విజయం అందుకున్నాడు. ఆయనే శివ కార్తికేయన్. ఈయన నటించిన వరుణ్ డాక్టర్ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. బయ్యర్లకు మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇదివరకు రెమో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు శివ కార్తికేయన్ కానీ ఈయనకు కోరుకున్న మార్కెట్ మాత్రం ఓపెన్ కాలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా వాటిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో ఈయన నటించిన సినిమా డాక్టర్. ఇదే సినిమాను తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదల చేశారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈయన విజయ్ హీరోగా బీస్ట్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. వరుణ్ డాక్టర్ సినిమా కథ హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా.. అసలు విడుదల అవుతుందనే విషయం కూడా తెలియకుండా వచ్చిన ఈ చిత్రానికి అనూహ్యంగా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ వచ్చాయి.
నైజాం: 0.65 కోట్లు
సీడెడ్: 0.38 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.23 కోట్లు
ఈస్ట్: 0.35 కోట్లు
వెస్ట్: 0.23 కోట్లు
గుంటూరు: 0.18 కోట్లు
కృష్ణా: 0.24 కోట్లు
నెల్లూరు: 0.15 కోట్లు
ఏపీ + తెలంగాణ: 2.45 కోట్లు షేర్
ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ.1.18 కోట్లకు అమ్మారు. అంటే 1.25 కోట్లు షేర్ వసూలు చేస్తే వరుణ్ డాక్టర్ హిట్ అనిపించుకుంటుంది. ఫైనల్ రన్లో ఎవరూ ఊహించని విధంగా 2.45 కోట్లు వసూలు చేసి.. 1.20 కోట్లకు పైగా లాభాలు అందుకుంది వరుణ్ డాక్టర్. దాంతో శివ కార్తికేయన్‌కు తెలుగులో కూడా మార్కెట్ ఓపెన్ అయిపోయినట్లే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రొమాంటిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఓకే.. రెండో రోజు పరిస్థితి ఏంటి..?
మహా సముద్రం ఫైనల్ కలెక్షన్స్.. శర్వానంద్ కు భారీ డిజాస్టర్..
పునీత్ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం..
50 రోజుల్లో 1000 కోట్ల బిజినెస్.. 2022 ఆరంభంలో అరాచకం..
చిరంజీవి, రజినీకాంత్ సినిమాల మధ్య ఈ పోలికలు గమనించారా..?