పునీత్ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం..

Puneeth rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి అప్పుడే 24 గంటలు గడిచిపోయింది. అమెరికాలో ఉన్న ఆయన కూతురు ధృతి బెంగళూరుకు వచ్చింది. ఉన్నత చదువుల కోసం ఆమె అమెరికా వెళ్లింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన ఆమెను ఎలాంటి ట్రాఫిక్ లేకుండా కంఠీరవ స్టేడియానికి తీసుకొచ్చారు పోలీసులు. కేవలం ఆమె కోసమే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఒక రోజు వాయిదా వేశారు. అక్టోబర్ 31 ఉదయం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. కర్ణాటక సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అయితే ఇక్కడే కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

పునీత్ రాజ్‌కుమార్‌కు కుమారులు లేరు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు వందిత ధృతి. దీంతో పునీత్ తలకొరివి పెట్టే బాధ్యతను ఆయన అన్న కొడుకు వినయ్ రాజ్‌కుమార్ ( vinay rajkumar ) తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే పునీత్ కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కు శివన్న, పునీత్ కాకుండా మరో కుమారుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు రాఘవేంద్ర రాజ్‌కుమార్ ( raghavendra rajkumar ). ఈయన పలు సినిమాల్లో కూడా నటించాడు. కానీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈయన కుమారుడు వినయ్ చేతుల మీదుగానే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. బాబాయ్ మరణ వార్త తెలిసినప్పటి నుంచి వినయ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. కెరీర్‌పరంగా తనకు చేదోడు వాదోడుగా ఉండే కొండంత బాబాయ్ ఇప్పుడు లేడని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నాడు వినయ్ రాజ్‌కుమార్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

