వరుడు కావలెను ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. టాక్ బాగున్నా వసూళ్లు బాగోలేవే..!

Varudu kavalenu collections | నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సినిమా వరుడు కావలెను. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 29న విడుదలైంది. దీనికి తొలిరోజు టాక్ బాగానే వచ్చింది. రొటీన్ కథే అయినా కూడా స్క్రీన్ ప్లే బాగుంది.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఓటేశారు ప్రేక్షకులు. కానీ కలెక్షన్స్ మాత్రం ఊహించినంత రాలేదు. మూడు రోజులకు కలిసి ఈ సినిమా కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 8 కోట్లకు పైగానే బిజినెస్ చేసిన వరుడు కావలెను గట్టెక్కాలంటే అద్భుతం జరగాల్సిందే. వరస ఫ్లాపులతో సతమతం అవుతున్న నాగ శౌర్య.. వరుడు కావలెనుతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. కానీ ఆయన కసికి బ్రేకులు పడేలా కనిపిస్తున్నాయి. మరి మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందో చూద్దాం..
నైజాం: 0.83 కోట్లు
సీడెడ్: 0.30 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.28 కోట్లు
ఈస్ట్: 0.25 కోట్లు
వెస్ట్: 0.20 కోట్లు
గుంటూరు: 0.16 కోట్లు
కృష్ణా: 0.21 కోట్లు
నెల్లూరు: 0.15 కోట్లు
ఏపీ + తెలంగాణ: 2.38 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.88 కోట్లు
వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్: 3.26 కోట్లు షేర్
నాగ శౌర్య బిజినెస్ స్థాయిని మించి వరుడు కావలెను చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే తొలి మూడు రోజుల్లో 3.26 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం మరో 5.50 కోట్లు రావాల్సిందే. లేదంటే భారీ నష్టాలు తప్పవు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని కోట్లు రావడం అంటే చాలా కష్టం. మరి చూడాలిక.. వరుడు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాడో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రోడ్డు ప్రమాదంలో మిస్ కేరళ-2019 విన్నర్, రన్నర్ దుర్మరణం
Samantha : సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Puneet Raj Kumar : పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Pawan Kalyan : పవర్ స్టార్ అంటే మండి పడుతున్న పవన్ కళ్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

