Pawan Kalyan: పవర్ స్టార్ అంటే మండి పడుతున్న పవన్ కళ్యాణ్

చేసింది తక్కువ సినిమాలే అయిన అభిమానులలో ఎనలేని ప్రేమని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ (pawan kalyan). అభిమానులు ఆయనని కొద్ది సంవత్సరాలుగా పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ పిలుపు పవన్‌కి నచ్చడం లేదు. ఇటీవల జరిగిన ఓ మీటింగ్‌లో పవర్ లేనివాడు పవర్ స్టార్ కాదని.. తనను జనసేనాని అని పిలవండి చాలు అన్నారు. తాను సరదాగా రాజకీయాలు చేయడం లేదు.. బాధ్యతతో రాజకీయాలు చేస్తున్నాని పవన్ స్పష్టం చేశారు.
ఇక ఆదివారం పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మీటింగ్ ఏర్పాటు చేయగా, అక్కడ అభిమానులు పవర్ స్టార్(power star) అంటూ గోలలు చేశారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. సభా మర్యాద తెలియదా, పవర్ స్టార్ అని ఎందుకు అరుస్తున్నారు.మీ మెడడులను పెంచుకోండి, నన్ను పవర్ స్టార్ అని పిలవడం మానేయండి అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గోకులంలో సీత సినిమా పవన్ కెరీర్లో తొలి హిట్ కాగా, ఈ సినిమాకు పోసాని కృష్ణమురళి ( posani krishna murali ) మాటలు రాశాడు. ఈ సినిమాకు పనిచేసిన సమయంలో పవన్ కళ్యాణ్‌ను చూసిన పోసాని.. పవర్ స్టార్ పేరు ఆయనకు సరిగ్గా సరిపోతుందని అనుకున్నాడు. ఇదే విషయాన్ని గోకులంలో సీత సినిమా విడుదల సందర్భంగా పోసాని చెప్పాడు.అప్పటి నుండి పవన్‌కు పవర్ స్టార్ బిరుదు అంటకట్టారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

