Hema | డిప్రెషన్‌తో చనిపోతానేమోనని భయపడ్డా.. 150 కిలోల ఐస్‌లో కూర్చొని అరిచాన్న నటి హేమ
Hema | సినీ రంగంలో నటీనటులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు కొన్నిసార్లు తీవ్ర మానసిక సంఘర్షణలకు దారితీస్తాయి. కెరీర్లో ఎదురయ్యే విమర్శలు, అవకాశాల విషయంలో వచ్చే ఒడిదుడుకులు, వ్యక్తిగత సమస్యలు కలిసి కొందరిని డిప్రెషన్ వరకు తీసుకెళ్తుంటాయి. తాజాగా నటి హేమ తన జీవితంలో ఎదుర్కొన్న ఇలాంటి ఓ క్లిష్టమైన దశ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు
Hema | సినీ రంగంలో నటీనటులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు కొన్నిసార్లు తీవ్ర మానసిక సంఘర్షణలకు దారితీస్తాయి. కెరీర్లో ఎదురయ్యే విమర్శలు, అవకాశాల విషయంలో వచ్చే ఒడిదుడుకులు, వ్యక్తిగత సమస్యలు కలిసి కొందరిని డిప్రెషన్ వరకు తీసుకెళ్తుంటాయి. తాజాగా నటి హేమ తన జీవితంలో ఎదుర్కొన్న ఇలాంటి ఓ క్లిష్టమైన దశ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనలో పేరుకుపోయిన భావోద్వేగాలను ఎలా బయటకు వ్యక్తపరచాలో తెలియక ఒక దశలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని హేమ తెలిపారు. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే.. డిప్రెషన్‌తో తానే ఏదైనా చేసుకుంటానేమో, లేదంటే కోపంలో ఇతరులకు హాని చేస్తానేమోనన్న భయం కూడా తనకు కలిగిందని ఆమె చెప్పారు.
తనపై వచ్చిన విమర్శలు, వివిధ సందర్భాల్లో ఎదురైన పరిస్థితులు తనలో చాలా కోపాన్ని, బాధను పేరుకుపోయేలా చేశాయని హేమ వివరించారు. ఆ భావాలను లోపలే దాచుకోవడం వల్ల పరిస్థితి మరింత కఠినంగా మారిందని ఆమె పేర్కొన్నారు.ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు హేమ ‘ఐస్ బాత్’ థెరపీని ఆశ్రయించినట్లు తెలిపారు. దాదాపు 150 కిలోల మంచు ముక్కల మధ్య కూర్చుని తనలోని కోపాన్ని, బాధను గట్టిగా అరుస్తూ బయటకు పంపించినట్లు చెప్పారు.ఐస్ బాత్కు ముందు నిపుణులు ప్రత్యేకంగా మానసికంగా సిద్ధం చేస్తారని హేమ తెలిపారు. మనసులో పేరుకుపోయిన బాధ, కోపం, ఆవేదనను బయటకు వదిలేయడానికి వారు గైడ్ చేస్తారని చెప్పారు. ఆ సమయంలో తనలో దాచుకున్న భావోద్వేగాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయని, గట్టిగా అరుస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశానని ఆమె వెల్లడించారు.
ఆ థెరపీ తర్వాత తన మనసు ఎంతో తేలికగా అనిపించిందని హేమ చెప్పారు. ఇంతకాలం తనలో పేరుకుపోయిన కోపం, బాధను బయటకు వ్యక్తపరచడం వల్ల మానసికంగా ప్రశాంతత లభించిందని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితినైనా గతంలో కంటే కూల్‌గా ఎదుర్కొంటున్నానని ఆమె పేర్కొన్నారు.ఈ అనుభవం తనలో మార్పు తీసుకురావడంతో ఐస్ బాత్కు సంబంధించి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నానని హేమ వెల్లడించారు. తనలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇతరులతో కలిసి ఐస్ బాత్ సెషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. తాను శిక్షణ పొందిన తర్వాత సుమారు 30 మందితో కలిసి తమ క్లబ్‌హౌస్‌లో ఐస్ బాత్ సెషన్స్ నిర్వహించినట్లు హేమ చెప్పారు. అయితే వర్షాకాలం కారణంగా ప్రస్తుతం ఈ కార్యక్రమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు, వేసవి కాలం ప్రారంభమైన తర్వాత మళ్లీ సెషన్స్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Actress
- car
- Depression
- hema
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

