Hebah Patel | పవర్ ఫుల్ యాక్టర్ బాబీ సింహా, అందాల నటి హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఓ కొత్త చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. మెహర్ యరమతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యువ కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో డిసెంబర్ 16న ఘనంగా లాంచ్ అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ క్లాప్ కొట్టగా, వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చిత్ర స్క్రిప్ట్‌ను తనికెళ్ల భరణి మేకర్స్‌కు అందించగా, ఈ వేడుకలో సినిమా యూనిట్ మొత్తం పాల్గొంది.
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను జి. కృష్ణ దాస్ నిర్వర్తిస్తుండగా, సంగీతాన్ని సిద్ధార్థ సదాశివుని అందిస్తున్నారు. వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఈవెంట్లో హెబ్బా పటేల్ తన కళ్ల చూపుతో నిర్మాత ఎస్కేన్ని అల్లాడించేసింది.ఇద్దరు ఒకరివైపు ఒకరు అదోలా చూసుకుంటూ ఉండగా ఇదంతా రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మూవీ లాంచింగ్ ఈవెంట్లో నిర్మాత యువ కృష్ణ మాట్లాడుతూ, “దర్శకుడు మెహర్ నా స్నేహితుడు. ఈ సినిమా కోసం చాలా కథలు విన్నాను. కానీ మెహర్ చెప్పిన కథ నాకు వెంటనే నచ్చింది. ఇది అద్భుతమైన స్క్రిప్ట్‌తో పాటు నటనకు విస్తృత అవకాశాలు ఉన్న కథ. ఈ కథ వినగానే బాబీ సింహ గారే నా మనసులోకి వచ్చారు. ఆయన బిజీగా ఉన్నప్పటికీ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. నిర్మాతగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, కథకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చి ఓ గొప్ప సినిమాతో మీ ముందుకు వస్తాం” అన్నారు. దర్శకుడు మెహర్ మాట్లాడుతూ, ఇది నా దర్శకుడిగా తొలి సినిమా. మీ అందరి ఆశీస్సులు, సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. మా టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. బలమైన కథ, అనుభవజ్ఞులైన నటులు, టెక్నికల్ టీమ్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం వెల్లడించింది.
Rebels to SKN: RajaSaab Updates ivvandra, promotions start cheyyandraa
Meanwhile @SKNonline 😭😭 pic.twitter.com/R9khG976mT
— Salaarodu (@Tweets_pillodu) December 16, 2025