Taapsee Pannu | ‘సోషల్ మీడియాపై ప్రజల్లో పెరిగిపోతున్న వ్యామోహం చూసి ఇలాంటి రోజు ఒకటొస్తుందని నేను ముందే ఊహించా.’ అన్నారు బాలీవుడ్ నటి తాప్సీ పన్ను. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మిషా అగర్వాల్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం ప్రస్తుతం బీటౌన్లో చర్చనీయాంశమైంది. ఆన్లైన్లో తనని అనుసరించే వారి సంఖ్య తగ్గడం వల్లే మిషా ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయంపై తాప్సీ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
‘కుటుంబ సభ్యులు చూపిస్తున్న ప్రేమకంటే ఆన్లైన్ ప్రేమపైనే జనాలు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మనిషికి జీవితానికి మించింది వేరొకటి ఉండ దు. కానీ జీవితం కంటే ఫాలోవ ర్స్ సంఖ్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే వీళ్లని ఏమనాలి? ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలను సైతం లైకులు, కామెంట్స్ డామినేట్ చేస్తున్నాయి. ఈ ప్రమాద ఘంటిక మోగి చాలాకాలమైంది. సమాజమే ఇంకా గుర్తించలేదు’ అంటూ బాధను వ్యక్తం చేశారు తాప్సీ.