ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి (Apollo Hospital) వైద్యులు ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కైకాల సత్యనారాయణకు చికిత్స కొనసాగుతుందని, ఆయన స్పృహలోనే ఉన్నారని అన్నారు. అయితే కైకాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ప్రస్తుతం ఆయనకు ఐసీయూలోనే వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎప్పటికపుడు డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుందని, బీపీ లెవల్స్ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్ సహాయంతో చికిత్సనందిస్తున్నట్టు డాక్టర్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. కైకాల త్వరగా కోలుకునిపూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, సినీ జనాలు ప్రార్థనలు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!
Karthikeya Lohita marriage | గ్రాండ్‌గా హీరో కార్తికేయ వివాహం..పెళ్లి వేడుక వీడియో
Akhanda New Poster Update | బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ షికారు..కొత్త పోస్టర్ అదిరింది
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్Advertisement