శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్‌తేజ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నదని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. గత మూడు రోజులుగా ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయిధరమ్‌తేజ్‌కు వైద్యులు కాలర్ బోన్ సర్జరీని నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని అపోలో వైద్యబృందం ప్రకటించింది.