Vaadivaasal | రెట్రో సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నటుడు సూర్య. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకు అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు సూర్య. ఆయన నటిస్తున్న చిత్రాలలో ఆర్జే బాలాజీ (RJ Balaji) చిత్రంతో పాటు వెట్రిమారన్ వాడివాసల్, వెంకీ అట్లూరి చిత్రాలు ఉన్నాయి. సూర్య కెరీర్లో 45 సినిమాగా వస్తున్న ఆర్జే బాలజీ చిత్రం అటు మైథాలాజీతో పాటు యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుంది. ఇదే కాకుండా వెంకీ అట్లూరితో తన 46వ సినిమా చేస్తున్నాడు సూర్య. ఇదిలావుంటే వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ అనే సినిమా కూడా సైన్ చేశాడు సూర్య. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి సూర్య తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తల ప్రకారం వెట్రిమారాన్ తన తర్వాతి ప్రాజెక్ట్ శింబుతో చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది వాడివాసల్ సినిమానా లేదా కొత్త ప్రాజెక్టా అనేది తెలియాల్సి ఉంది. అయితే, శింబు కూడా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే కమల్ హాసన్ థగ్లైఫ్లో నటించిన శింబు ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లను ఒకే చేశాడు. ఇందులో డ్రాగన్ దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో ఒక సినిమా కాగా.. దేశింగు పెరియసామి, రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. మరోవైపు వాడివాసల్ ఆగిపోయిందా.. లేదా వాయిదా పడిందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
‘వాడివాసల్’ ప్రాజెక్ట్ చాలా కాలంగా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. జల్లికట్టు నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా.. దీనికోసం సూర్య జల్లికట్టు శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాను వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించనున్నారు.
Read More