Pooja Hegde | సల్మాన్ ఖాన్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘బజ్రంగీ భాయ్‌జాన్’. 2015లో విడుదలైన ఈ సినిమా సల్మాన్‌కు సకుటుంబ చిత్రంగా ఘన విజయాన్ని అందించింది. కబీర్ ఖాన్ దర్శకుడు. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీక్వెల్‌కు ‘పవన పుత్ర’ అనే టైటిల్‌ను గతంలోనే ప్రకటించారు.
ఈ చిత్రంతో సల్మాన్ ఖాన్‌తో పాటు నాయిక కరీనా కపూర్ కూడా మంచి పేరు తెచ్చుతుంది. అయితే సీక్వెల్లో హీరోయిన్గా కరీనా కపూర్ బదులు పూజా హెగ్డేను ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. తొలి చిత్రంలో కరీనా కపూర్ పోషించిన పాత్రలో పూజా కనిపించనుందట. ప్రస్తుతం పూజా హెగ్డే సల్మాన్‌తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో నటిస్తున్నది.