హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఒక కుటుంబం రాబడి ఏటికేడు పెరిగితేనే అందరూ సంతోషంగా ఉంటారు. ఇది ఆ కుటుంబ యజమాని సమర్థతకు నిదర్శనం. అలా కాకుండా రోజురోజుకూ ఆదాయం క్షీణిస్తుంటే? వనరులన్నీ అందుబాటులో ఉండి కూడా వాడుకొని, ఆదాయాన్ని సృష్టించుకోలేకపోతుంటే? రాబడి పెంచుకోలేకపోతే? అది ఆ కుటుంబాన్ని నడిపే వ్యక్తి అసమర్థతకు నిలువుటద్దం. ప్రస్తుతం రాష్ట్రంలో అదే జరుగుతున్నది. కేసీఆర్ పాలనలో పదేండ్ల పాటు ఆర్థిక రంగంలో తెలంగాణ రాకెట్ వేగంతో వృద్ధి సాధించింది. పసికూనే అయినా పెద్ద పెద్ద రాష్ర్టాలను సైతం వెనక్కి నెట్టి అద్భుత విజయాలు సాధించింది. కానీ గత వెయ్యి రోజుల్లో పరిస్థితి తలకిందులైంది.
సొంత ఆదాయ వనరులు పెంచడంలో విఫలం.. పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పించడంలో ఘోర వైఫల్యం.. మిగులు రాష్ర్టాన్ని లోటు బడ్జెట్లోకి తోసేసిన చేతగానితనం.. రాష్ట్ర రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ వద్ద దేబిరించే దైన్యం.. రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో అప్పులు చేయడం.. ప్రజల తలసరి ఆదాయాన్ని మింగేసే అసమర్థ విధానాలు అమలుచేయడం.. కూల్చడం తప్ప, పేర్చడం తెలియని విధానం.. తరిగిపోయిన రెవెన్యూ రాబడులు.. పడినపోయిన జీఎస్డీపీ వృద్ధిరేటు.. తరలిపోతున్న కంపెనీలు.. ఇవీ వెయ్యి రోజుల రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో కనిపిస్తున్న దుర్భర పరిస్థితులు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఒకప్పుడు తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న రాష్ట్రం కిందికి పడిపోయింది. జీఎస్డీపీలో, సొంత రెవెన్యూ రాబడుల్లో వృద్ధిరేటు క్షీణించింది. కొత్త పెట్టుబడుల జాడలేకపోగా, వచ్చిన పరిశ్రమలు ఇతర రాష్ర్టాలకు తరలి వెళ్తున్నాయి. మొత్తంగా.. కేసీఆర్ పదేండ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి అనే జోడెడ్లతో రెండంకెల వృద్ధిని సాధిస్తూ అన్ని రంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోయిన తెలంగాణ ఆర్థిక రంగం, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో పతనం దిశగా అడుగులు వేస్తున్నది.
ఒక దేశం లేదా రాష్ట్ర ప్రజల సగటు ఆర్థిక స్థితిని అంచనా వేసేందుకు ఉపయోగించే కీలక సూచిక తలసరి ఆదాయం. అకడి ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలిపే ప్రధాన కొలమానంగా చెప్తుంటారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24, 104 ఉన్నది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా నడిపించారు. దీంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. తలసరి ఆదాయం రాకెట్ వేగంతో వృద్ధి చెందింది. ఫలింతగా దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో తెలంగాణ సగర్వంగా నిలిచింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలన ముగిసే సమయానికి, 2023-24 నాటికి తలసరి ఆదాయం రూ.3,47,299 పెరిగింది.
అంటే పదేండ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 179.84 శాతం (సుమారు 180 శాతం) పెరిగిందన్నమాట. ఏడాదికి 17.98 శాతం వృద్ధిరేటు సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయ వృద్ధిరేటులో మందగమనం మొదలైంది. ఒకప్పుడు ఏటా గణనీయంగా పెరిగిన తెలంగాణ వృద్ధిరేటు.. రేవంత్ రెడ్డి సర్కార్ ఏలుబడిలో పతనం దిశగా అడుగులు మొదలయ్యాయి. 2025-26 నాటికి తలసరి ఆదాయం రూ.4,18,931కు పెరిగినా.. వృద్ధి రేటు మందగించింది. 8.25 శాతం మాత్రమే నమోదైంది. గతంలో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో ఉండగా, బడ్జెట్లు, సామాజిక ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,33,326తో కర్ణాటక టాప్‌లో నిలిచింది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ తలసరి ఆదాయ ర్యాంకు పడిపోయింది.
2014-15: రూ.1,24,104
2023-24: రూ.3,47,299
2025-26: రూ.4,18,931
బీఆర్ఎస్ పాలన: 17.98%
కాంగ్రెస్ పాలన: 8.25%
ఒక దేశం లేదా రాష్ట్ర ప్రజల సగటు ఆర్థిక స్థితిని అంచనా వేసేందుకు ఉపయోగించే కీలక సూచిక తలసరి ఆదాయం. అకడి ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలిపే ప్రధాన కొలమానంగా చెప్తుంటారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24, 104 ఉన్నది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా నడిపించారు. దీంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. తలసరి ఆదాయం రాకెట్ వేగంతో వృద్ధి చెందింది. ఫలింతగా దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో తెలంగాణ సగర్వంగా నిలిచింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలన ముగిసే సమయానికి, 2023-24 నాటికి తలసరి ఆదాయం రూ.3,47,299 పెరిగింది.
అంటే పదేండ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 179.84 శాతం (సుమారు 180 శాతం) పెరిగిందన్నమాట. ఏడాదికి 17.98 శాతం వృద్ధిరేటు సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయ వృద్ధిరేటులో మందగమనం మొదలైంది. ఒకప్పుడు ఏటా గణనీయంగా పెరిగిన తెలంగాణ వృద్ధిరేటు.. రేవంత్ రెడ్డి సర్కార్ ఏలుబడిలో పతనం దిశగా అడుగులు మొదలయ్యాయి. 2025-26 నాటికి తలసరి ఆదాయం రూ.4,18,931కు పెరిగినా.. వృద్ధి రేటు మందగించింది. 8.25 శాతం మాత్రమే నమోదైంది. గతంలో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో ఉండగా, బడ్జెట్లు, సామాజిక ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,33,326తో కర్ణాటక టాప్‌లో నిలిచింది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ తలసరి ఆదాయ ర్యాంకు పడిపోయింది.
ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని ప్రతిబింబించేది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ). మొత్తం ఆర్థిక బలాన్ని, నిర్దిష్ట కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవలను అంచనా వేసే అతి ముఖ్యమైన కొలమానం ఇది. ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సరిహద్దుల లోపల సృష్టించిన మొత్తం సంపద లేదా ఆదాయాన్ని ఈ అంకెలు స్పష్టం చేస్తాయి. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, సేవారంగాల పురోగతి ఆధారంగా ఈ సంపద పెరుగుతుంది. జీఎస్డీపీ వేగంగా పెరిగిందంటే అకడ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యిందని అర్థం.
కేసీఆర్ పదేండ్లపాలనలో జీఎస్డీపీ సగటున ఏడాదికి 13.9 శాతం వృద్ధి రేటు సాధించింది. 2014-15లో ప్రస్తుత ధరల వద్ద రూ.5.05 లక్షల కోట్లుగా నమోదైన జీఎస్డీపీ 2023-24 నాటికి రికార్డు స్థాయిలో రూ.14.64 లక్షల కోట్లకు చేరింది.
కానీ రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో వృద్ధిరేటుకు బ్రేకులు పడ్డాయి. గతంలో రెండంకెల వృద్ధిరేటు సాధించిన జీఎస్డీపీ.. కాంగ్రెస్ పాలనలో సగటున 8.4 శాతానికి పడిపోయింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వృద్ధి వేగం గణనీయంగా మందగించింది. తాజాగా ఆగస్టులో విడుదలైన ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2025-26 సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ రూ.16,14,771 కోట్లకు చేరింది. ఇది గతంతో పోల్చితే 8.4 శాతం వృద్ధి సాధించినట్టు వెల్లడించింది. గతంలో వృద్ధిరేటులో తెలంగాణ టాప్‌లో ఉండగా, దేశంలో పెద్ద రాష్ర్టాల జీఎస్డీపీ ర్యాంకుల్లో తెలంగాణ ఏడో స్థానానికి పడిపోయింది.
2014-15: రూ.5.05 లక్షల కోట్లు
2023-24: రూ.14.64 లక్షల కోట్లు
2025-26: రూ.16.14 లక్షల కోట్లు
బీఆర్ఎస్ పాలనలో: 18.99%
కాంగ్రెస్ హయాంలో: 8.68%
2021-22లో 3,523 పరిశ్రమల నుంచి 2024-25లో 2,014కు సంఖ్య తగ్గడం పారిశ్రామిక వర్గాల్లో చర్చకు కారణమవుతున్నది. పెట్టుబడిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించకపోగా, వారిని తుపాకులతో బెదిరిస్తున్నట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ బలాన్ని ప్రతిబింబించే మరో సూచిక రాష్ట్ర బడ్జెట్. ఆర్థికంగా అభివృద్ధి జరిగితే ఆమ్దానీ పెరుగుతుంది. ఆమ్దానీ పెరిగితేనే బడ్జెట్ ప్రతిపాదనలు పెరుగుతాయి. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2014-15లో రూ.1,00,637 కోట్లుగా ఉన్న బడ్జెట్ 2023-24 నాటికి సుమారు రూ.2.9 లక్షల కోట్లకు చేరాయి. 190 శాతం పెరిగింది. అంటే.. సగటున ఏటా దాదాపు 19 శాతం వృద్ధి నమోదైంది.
కాంగ్రెస్ పాలనలో బడ్జెట్ పెరుగుదల మందగించింది. ప్రతిపాదనలు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. 2026-27 నాటికి బడ్జెట్ పరిమాణం రూ.3.24 లక్షల కోట్లుగా ఉన్నది. అంకెల పరంగా పెరిగినట్టు అనిపించినా, గతంతో పోల్చితే పెరుగుదల రేటు మాత్రం తగ్గింది. కేసీఆర్ పాలనలో ఎప్పుడూ మిగులు బడ్జెట్ ఉండగా, రేవంత్‌రెడ్డి పాలనలో లోటు బడ్జెట్ నమోదైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2014-15: రూ.1 లక్ష కోట్లు
2023-24: రూ.2.9 లక్షల కోట్లు
2026-27: రూ.3.24 లక్షల కోట్లు
బీఆర్ఎస్ : 19%
కాంగ్రెస్ : 4.68%
రాష్ట్రం సొంతంగా సమీకరించుకునే రెవెన్యూ రాబడుల్లో కూడా రేవంత్ సర్కార్ చేతులెత్తేసింది. తలసరి ఆదాయం తరహాలోనే, రాష్ట్ర వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధిరేటు తగ్గిపోయింది. కేసీఆర్ హయాంలో సగటున ఏడాదికి 32.42 శాతం నమోదుతో రెండంకెల స్థాయిలో దూసుకుపోయింది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పాలనలో రుణాల భారం, మారుతున్న ఆర్థిక సమీకరణల వల్ల వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు (2.42 శాతానికి) పరిమితమైంది. 2014-15లో రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది రెవెన్యూ రాబడులు రూ.51,042 కోట్లు మాత్రమే ఉండేవి. కానీ బీఆర్ఎస్ పాలన ముగిసే సమయానికి ఈ రాబడులు బడ్జెట్ అంచనాల ప్రకారం.. రికార్డు స్థాయిలో రూ. 2,16,567 కోట్లకు చేరాయి. ఈ పదేండ్లకాలంలో మొత్తం రాబడుల వృద్ధి సుమారు 324 శాతంగా నమోదైంది. అంటే ఏడాదికి సగటున రికార్డుస్థాయిలో 32.42 శాతం వృద్ధి రేటు సాధించి, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది.
వెయ్యి రోజుల రేవంత్‌రెడ్డి పాలనను పరిశీలిస్తే, బడ్జెట్ అంచనాలు, కాగ్ నివేదికల ప్రకారం 2025-26 నాటికి రెవెన్యూ రాబడులు సుమారు రూ.2,29,721 కోట్లకు పరిమితమయ్యాయి. గత పదేండ్లతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో రాబడుల పెరుగుదల వేగం గణనీయంగా తగ్గింది.
2014-15: రూ.51,042 కోట్లు
2023-24: రూ.2,16,567 కోట్లు
2025-26: రూ.2,29,721 కోట్లు
బీఆర్ఎస్ : 32.42%
కాంగ్రెస్ : 2.42%
మౌలిక వసతులు, సాగునీరు, విద్యుత్, ఇతర దీర్ఘకాలిక ఆస్తుల సృష్టికి మూలధన వ్యయం అత్యంత కీలకం. కేసీఆర్ పాలనలో మౌలిక వసతుల కల్పన, కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి బడ్జెట్ నాటికి మూలధన వ్యయం కేవలం రూ.11,154 కోట్లుగా ఉండేది. బీఆర్ఎస్ పాలన ముగిసే సమయానికి (2023-24 నాటికి) సాగునీటి రంగానికి నిధుల ప్రవాహం, మౌలిక సదుపాయాల విస్తరణతో వార్షిక మూలధన వ్యయం రికార్డు స్థాయిలో రూ. 37,525 కోట్లకు చేరింది. అలా పదేండ్లలో మూలధన వ్యయంలో వృద్ధిరేటు 236.42 శాతంగా నమోదైంది.
రేవంత్‌రెడ్డి పాలన ప్రారంభమైన తర్వాత 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం మూలధన వ్యయాన్ని రూ.47,267 కోట్లుగా ప్రతిపాదించారు. రెండున్నరేండ్ల కాలంలో మూలధన వ్యయంలో పెరుగుదల కేవలం 25.96 శాతంగానే రికార్డయ్యింది. అంటే కాంగ్రెస్ హయాంలోనూ మూలధన వ్యయం పెరిగినప్పటికీ.. గత దశాబ్దంతో పోలిస్తే వృద్ధి రేటు దాదాపు సగానికి పడిపోయింది.
2014-15: రూ.11,154 కోట్లు
2023-24: రూ.37,525 కోట్లు
2025-26: రూ.47,267 కోట్లు
బీఆర్ఎస్ : 23.64%
కాంగ్రెస్ : 12.98%
బీఆర్ఎస్ పాలనలో సగటు వార్షిక అప్పు: రూ.49,473 కోట్లు
కాంగ్రెస్ ఏలుబడిలో ఏటా సగటు అప్పు: రూ.1.65 లక్షల కోట్లు
తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న అంశం అప్పులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెయ్యి రోజుల్లోనే రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. రికార్డుస్థాయిలో అప్పులు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో చేసిన అప్పులను కాంగ్రెస్ సర్కార్ కేవలం రెండున్నరేండ్లలోనే దాటేయడం గమనార్హం. రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారం చేపట్టిన 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.4.68 లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల పాటుసాగిన బీఆర్ఎస్ పాలనలో మొత్తం అప్పులు రూ.4.7 లక్షల కోట్లు అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన రుణాలు రూ.69,000 కోట్లు కూడా కలిసి ఉన్నాయి. బీఆర్ఎస్ చేసిన బడ్జెటేతర అప్పులు రూ.1.1 లక్షల కోట్లు మాత్రమే. బీఆర్ఎస్ చేసిన అప్పు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే ఉన్నది. కానీ కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అప్పునకు దాదాపు సమానమైన అప్పులను కాంగ్రెస్ వెయ్యి రోజుల్లోనే తెచ్చేసింది. బడ్జెటేతర (నాన్-ఎఫ్ఆర్బీఎం) అప్పుల విషయానికి వస్తే.. గత ప్రభుత్వం చేసిన దానికి రెండింతల అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం 33 నెలల్లోనే చేసి చూపించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మొత్తం అప్పులు రూ.4.70 లక్షల కోట్లుగా ఉండగా, కాంగ్రెస్ పాలనలో 33 నెలల్లోనే 4.68 లక్షల కోట్ల మేర అప్పులు నమోదయ్యాయి.
మొత్తం అప్పు: రూ.4.70 లక్షల కోట్లు
ఎఫ్ఆర్బీఎం: రూ.3.60 లక్షల కోట్లు
నాన్-ఎఫ్ఆర్బీఎం: రూ.1.10 లక్షల కోట్లు
మొత్తం అప్పు: రూ.4.68 లక్షల కోట్లు
ఎఫ్ఆర్బీఎం: రూ.2.33 లక్షల కోట్లు
నాన్ -ఎఫ్ఆర్బీఎం: రూ.2.35 లక్షల కోట్లు

తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రముఖ కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లాయి. 2024 జనవరి నుంచి 2025 అక్టోబర్ వరకు 305 పరిశ్రమలు మూతపడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రంలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ తమ విస్తరణను తమిళనాడుకు తరలించింది. రూ.15వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారీ పెట్టుబడితో పాటు దాదాపు 14 వేల ఉద్యోగాలను తెలంగాణ కోల్పోయినట్టయింది. కేన్స్ తమ సెమీ కండక్టర్ల పరిశ్రమను గుజరాత్‌కు తరలించింది. బీఆర్ఎస్ హయాంలో సెమికండక్టర్ల యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఈ సంస్థ.. గుజరాత్‌లోని సనంద్‌లో రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ కంపెనీ హైదరాబాద్‌ను కాదని తమిళనాడులో రూ.వెయ్యి కోట్లతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది.

పరిశ్రమల విషయంలోనూ గతంతో పోలిస్తే తగ్గుదల స్పష్టంగా కనిపిస్తున్నది. టీజీఐపాస్ పోర్టల్‌లోని అధికారిక గణాంకాల ప్రకారం.. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో మొత్తం 22,232 పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. సుమారు 17 లక్షల మందికి ఉపాధి లభించింది. కానీ, కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో 5,163 పరిశ్రమలు మాత్రమే వచ్చాయి.