Pawan kalyan | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్‌లో ఓ నటుడు మాత్రమే కాకుండా, డైరెక్టర్, నిర్మాత కూడా ఉన్నాడని తెలిసిందే. యాక్టింగ్‌తోపాటు సినిమా నిర్మాణం, లాభనష్టాలపై పవన్ కల్యాణ్‌కు సంపూర్ణ అవగాహన ఉంటుంది. సినిమాకు లాభాలు వస్తే సమస్య లేదు.. కానీ నష్టాలు వస్తే మాత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎంత ఇబ్బంది పడతారో ఓ అంచనా ఉంటుంది. ఈ ఏడాది హరిహరవీరమల్లు, ఓజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
అయితే హరిహరవీరమల్లు ఊహించని విధంగా ఫెయిల్యూర్‌గా నిలిచింది. కానీ ఓజీ మాత్రం మంచి వసూళ్లు తెచ్చిపెట్టింది. ఎంతలా అంటే హరిహరవీరమల్లుతో కుదేలైన ఓ డిస్ట్రిబ్యూటర్‌కు భారీ ఉపశమనం కల్పించేంతలా.
నార్త్ అమెరికాలో ఈ ఏడాది అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా ఓజీ అరుదైన ఫీట్ నమోదు చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అక్కడ రూ.12 కోట్లకు అమ్ముడుపోయిన ఈ చిత్రం నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టడమే కాదు.. ఈ ఏడాది ఇంటర్నేషనల్ మార్కెట్ సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకున్న వన్ ఆఫ్ ది తెలుగు సినిమాల్లో ఒకటిగా ఓజీ నిలిచిందంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ట్విస్ట్ ఏంటంటే అదే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఇటీవలే హరిహరవీరమల్లు సినిమా రైట్స్ దక్కించుకోగా.. డిజాస్టర్‌గా నిలవడంతో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. తాను పెట్టిన మొత్తంతో పోలిస్తే భారీ ఎత్తున నష్టపోవడంతో సదరు డిస్ట్రిబ్యూటర్‌కు తలకు మించిన భారంలా మారిందట. హరిహరవీరమల్లుతో ఏర్పడిన భారీ నష్టాలు ఇప్పుడు ఓజీ వసూళ్లతో బ్యాలెన్స్ అయ్యాయన్నమాట. మొత్తానికి తన సినిమాను నమ్ముకుని నష్టాల పాలైన డిస్ట్రిబ్యూటర్‌కు మళ్లీ తన సినిమాతోనే లాభాలు తెచ్చిపెట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు పవన్ కల్యాణ్.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్