టాలీవుడ్ (Tollywood)లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్‌కు ముందే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో నిలిచిపోయిన షూటింగ్‌ను క్రిష్ టీం మళ్లీ నేడు మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో హరిహరవీరమల్లు కొత్త షెడ్యూల్ రీస్టార్ట్ అవగా..పవన్ కల్యాణ్ ఈ షెడ్యూల్లోజాయిన్ కానున్నాడు.
తాజా షెడ్యూల్లో హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనుండగా..బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనున్నారని టాక్. నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుండగా..ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పిస్తుండగా..ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
2022 ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో సందడి చేయబోతున్నాడు. పవన్‌కల్యాణ్ దీంతోపాటు భీమ్లానాయక్, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలు కూడా చేస్తున్నాడు.
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్