Hardik Pandya | స్టార్ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. గతేడాది తన భార్య నటాషాతో విడాకులు ప్రకటించిన అనంతరం పాండ్య బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కొన్నిరోజులు డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇది కూడా కొన్నిరోజులకే బ్రేకప్ అవ్వగా.. తాజాగా పాండ్య మరో అమ్మాయితో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి పాండ్య మోడల్, నటి మహియెకా శర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వైరలవుతున్నాయి.
మొదటగా ఈ పుకార్లు రెడిట్ అనే సోషల్ మీడియా ద్వారా ప్రారంభం అయ్యాయి. ఇందులో ఒక పోస్ట్‌లో మహియెకా షేర్ చేసిన ఒక సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వ్యక్తి బ్లర్‌గా కనిపించాడు. అయితే అతడు హార్దిక్ పాండ్యానే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాకుండా మహియెకా పోస్ట్‌లలో ఎక్కడో హార్దిక్ జెర్సీ నంబర్ 33 కనిపించడాన్ని కూడా ఒక యూజర్ గుర్తించారు. మరోవైపు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. హార్దిక్, మహియెకా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారని అభిమానులు గమనించారు. కొన్ని ఫోటోలలో ఇద్దరూ ఒకే రకమైన బాత్రోబ్ ధరించినట్లు కూడా గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో బయటపెట్టారు. ఆసియా కప్ కోసం హార్దిక్ దుబాయ్‌లో ఉన్న సమయంలో మహియెకా కూడా అక్కడికి వెళ్లినట్లు వార్తలు రావడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Idolo Hardik pandya moves faster than the light😭😭 https://t.co/yjjjpdCUVp pic.twitter.com/JcKmXVZgcB
— Amar💫 (@KUNGFU_PANDYA_0) September 15, 2025