లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’. సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు రితేష్‌రానా దర్శకత్వం వహించారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సమర్పణలో చిరంజీవి (చెరీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 15న ఈ సినిమాను విడుదల చేయాలని ముందుగా చిత్రబృందం అనుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను జూలై 8కి మార్చారు. విడుదల తేదీ ప్రకటన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..‘అనుకున్న తేదీకి మరో వారం ముందుగానే మా చిత్రాన్ని విడుదలకు తీసుకొస్తున్నాం. ఇప్పటిదాకా తెరపై చూడని సరికొత్త నేపథ్యం, వివైధ్యంగా సాగే పాత్రలు ఆకట్టుకుంటాయి. థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా సినిమా మెప్పిస్తుందని నమ్ముతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం, సంగీతం : కాలభైరవ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బాల సుబ్రహ్మణ్యం కేవీవీ.