Hanuman Movie | సంక్రాంతిపై ముందుగా ఖర్చీఫ్ వేసిని సినిమాల్లో హనుమాన్ ఒకటి. ముందుగా సమ్మర్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నా.. వీఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ చేశారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఏ రేంజ్లో దూసుకుపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సహా అన్ని వుడ్‌లలోనూ ఉహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా హిందీ నిర్మాతలు ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం కోట్లల్లో ఆఫర్ చేస్తున్నారట. ఇక ఇదిలా ఉంటే తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ వర్మ వినాయక చవితి నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. చెప్పినట్లుగానే వినాయక చవితికి స్పెషల్ పోస్టర్‌తో ప్రమోషన్లు షురూ చేశారు. తేజసజ్జా వినాయకుడిని ఎత్తుకున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. ‘అ!’ ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి సినిమాలో విభిన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో జనాల్లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. సూపర్ హీరో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. డాక్టర్ ఫేం వినయ్‌రాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.
ప్రైమ్ షో ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా తెలుగు సహా 11 భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నంది. అందులో కొరియన్, జపనీస్, ఇంగ్లీష్, స్పానీష్, చైనీస్ భాషలు కూడా ఉన్నాయి. ఒక తెలుగు సినిమా ఇన్ని భాషల్లో రిలీజవడం ఇదే తొలిసారి. కంటెంట్ మీదున్న నమ్మకంతో భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో వెల్లడించారు.
Team #HanuMan wishes everyone a Happy Ganesh Chaturthi❤️
With the blessings of Lord Ganesh kickstarting the promotions🙏
Exciting Updates Soon🔥
IN CINEMAS, JAN 12th 2024,
Sankranthi in 11 Languages WW💥🌟ing @tejasajja123@Niran_Reddy @Primeshowtweets pic.twitter.com/gYNj0UjCIl
— Prasanth Varma (@PrasanthVarma) September 18, 2023